వర్ల పిటీషన్ పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పిటీషన్ పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది

Update: 2022-11-17 07:38 GMT

టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పిటీషన్ పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాజకీయ దురుద్దేశం అయితే విచారణ చేయవద్దా? అని ప్రశ్నించింది. అంత క్లీన్ గా ఉన్నప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీసింది. విచారణ జరిగేంత వరకూ అంతా మసకగా ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

సిట్ దర్యాప్తుపై...
చంద్రబాబు హయాంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ తో విచారణకు ఆదేశించింది. ఈ విచారణను నిలుపుదల చేయాలంటూ వర్ల రామయ్య హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వర్ల రామయ్య తరుపున న్యాయవాది వాదిస్తూ సిట్ కాకుండా మాజీ న్యాయమూర్తి చేత విచారణ జరపాలని కోరారు. అయితే విచారణను అడ్డుకోవడానికే ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ప్రభుత్వం తరుపున న్యాయవాది సుప్రీంకోర్టుకుత తెలిపారు. దీనిపై ఇరు వర్గాల వాదన విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.


Tags:    

Similar News