వైసీపీ ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు

ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2022-12-12 08:39 GMT

ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడకు చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబు దాదాపు ఎనిమిది నెలల నుంచి రాజమండ్రి జైలులో ిరిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన పలు దఫాలు హైకోర్టును ఆశ్రయించినా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయన వేసిన పిటీషన్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు పలుమార్లు తీర్పుచెప్పింది.

బెయిల్ నిబంధనలను...
ీదీంతో అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చిన సుప్రీంకోర్టు బెయిల్ నిబంధనలను ట్రయల్ కోర్టు నిర్దేశిస్తుందని తెలిపింది. ఈ ఏడాది మే నెల 19వ తేదీన సుబ్రమణ్యం హత్య జరిగింది. తర్వాత అనంతబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెయిల్ పత్రాలు అందిన తర్వాత అనంతబాబు విడుదలయ్యే అవకాశముంది. బహుశ రేపు రాజమండ్రి జైలు నుంచి విడుదల కావచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News