నేడు హైకోర్టులో సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటీషన్
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో ఏపీ హైకోర్టును ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆశ్రయించారు. బీహార్ కు వెళ్లిన పోలీసులు అక్కడి ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో అక్కడే ఉండి సునీల్ నాయక్ ను తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
రఘురామ కృష్ణరాజు కస్టోడియల్...
ఈ నేపథ్యంలోనే సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ విచారణ కేసులో విచారించాలని సునీల్ నాయక్ సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆయనపై నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. సునీల్ ముందస్తుబెయిల్‌పై విచారించనున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.