Ys Jagan : నేడు నెల్లూరుకు వైఎస్ జగన్

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ నెల్లూరులో పర్యటించనున్నారు

Update: 2026-02-26 02:36 GMT

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు నెల్లూరు చేరుకుని స్కిల్‌ డెవలప్‌మెంట్ మాజీ ఛైర్మన్‌ కొండూరు అజయ్‌ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు. జగన్ రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వివాహ వేడుకకు
వివాహ వేడుకకు హాజరవుతున్నప్పటికీ భారీ సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ అభిమానులు తరలి వచ్చే అవకాశముందని భావించి పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా పార్టీ నేతలతో ఆయన మాట్లాడతారని తెలిసింది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి, అక్రమ కేసులకు భయపడవద్దంటూ చెప్పి వెళతారని సమాచారం.


Tags:    

Similar News