Andhra Pradesh : అన్ని రోగాలకూ చెక్.. ఏపీ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2026-02-26 04:20 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా నిర్ణయాలను తీసుకుంటోంది. ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ శాసన మండలిలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. త్వరలోనే అన్ని గ్రామాలకు సురక్షితమైన మంచినీటి పథకాన్ని అందిస్తామని సభ సాక్షిగా మాటిచ్చారు. అందుకు అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వస్తున్నాయని ఆయన తెలిపారు.

సురక్షితమైన మంచినీరు...
రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలును పకడ్బందీగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 8 మల్టీ విలేజ్ స్కీమ్స్‌లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత తాగునీటి పథకానికి ఇప్పటివరకు ప్రభుత్వం 4,162.95 కోట్లు ఖర్చు చేసింది. మార్చి 2024 వరకు కేంద్ర ప్రభుత్వం రూ. 2,254.89 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 1,649.68 కోట్లు ఇచ్చింది. మొత్తం రూ. 3,904.57 కోట్లు గ్రామీణ మంచినీటి పథకాల కోసం ఖర్చు చేయనుంది.మొత్తం ఖర్చు 4,002.78 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పటి వరకూ మొత్తం ఖర్చు 1,498.78 కోట్లు విడుదల అయ్యాయి.
ఇప్పటి వరకూ...
రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ కింద మొత్తం 41,840 సింగిల్ విలేజ్ స్కీమ్స్ మరియు 8 మల్టీ విలేజ్ స్కీమ్స్ అమలులో ఉన్నాయి. మొత్తం అంచనా వ్యయం రూ. 26,823.94 కోట్లు కాగా, ఇప్పటివరకు 26,440 సింగిల్ విలేజ్ స్కీమ్స్ పూర్తయ్యాయి. ఇవన్నీ పూర్తయితే దాదాపుగా అన్ని గ్రామాలకు సురక్షితమైన మంచినీరు అందేఅవకాశముంది. దీనివల్ల డయేరియా, కిడ్నీసంబంధిత వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడానికి వీలవుతుంది. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రణాళికలను ఎప్పటికప్పుడు రూపొందించి, అందుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


Tags:    

Similar News