Chandrababu : విధ్వంసమైన పాలనను గాడిలో పెడుతున్నాం

గత పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని చంద్రబాబు అన్నారు

Update: 2026-02-25 12:11 GMT

గత పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని చంద్రబాబు అన్నారు. మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. పునర్నిర్మాణం కోసం ఎన్నికల్లో మీ సహకారం కోరానన్నారు. గత ఎన్నికల్లో 94 శాతం స్ట్రయిక్ రేట్ తో అఖండ విజయం కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు అరకు నుంచి ఉమ్మడి ప్రకాశం వరకూ ఒక్కసీటు కూడా వాళ్లకు రాలేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లా అంతా కూటమిని వందశాతం గెలిపించాలని కోరారు. 150 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలుకు వెళ్లాల్సిన ఇబ్బంది తొలగిస్తూ మార్కాపురం ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు. మార్కాపురం జిల్లా మదనపల్లి జిల్లా, అలాగే పోలవరం జిల్లాను కూడా ఏర్పాటు చేశామన్న చంద్రబాబు వెనుకబడిన ప్రాంతాలు నీరు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డారు. మార్కాపురానికి మరో వరంగా వెలిగొండ పూర్తి చేసి నీరందిస్తామని తెలిపారు. గతంలో ఈ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని, ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి నాకే అవకాశం వచ్చిందని తెలిపారు. 2019-24 మధ్య రాష్ట్రానికి చీకటి రోజులు. వెలిగొండ పనులు ఒక్క అడుగు ముందుకు వేయలేదన్నారు. 4.35 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగరి లాంటి నియోజకవర్గాలతో పాటు ఉదయగిరి, కడప, బద్వేలుకు కూడా నీళ్లు వెళ్తాయని చెప్పారు.

తాను సీఎంగా కొనసాగి ఉండి ఉంటే...
గతంలో తాను ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే 2021లోనే ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇచ్చేవాళ్లమన్న చంద్రబాబు గత పాలకుడు పనులు పూర్తి అయ్యాయని దొంగ నాటకాలు ఆడారని, పనులు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేశారని చంద్రబాబు తెలిపారు. నిజంగానే ప్రాజెక్టు పనులు పూర్తి అయి ఉంటే ఇప్పుడు నేను రావాల్సిన అవసరమే ఉండేది కాదన్నారు. ప్రాజెక్టు పూర్తి చేస్తానని నాలుగు సార్లు సభలు పెట్టి నాలుగు తేదీలు ఇచ్చాడని, కానీ ప్రజలెవరూ అతన్ని నిలదీయలేదన్న చంద్రబాబు ఉత్తుత్తి ప్రాజెక్టుకు రిబ్బను కట్ చేసి మోసం చేశాడని, రూ.9081 కోట్ల నిధులు ఈ ప్రాజెక్టుకు అవసరమని, ఇప్పటి వరకూ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5451 కోట్లు ఖర్చు వ్యయం చేశామని చెప్పారు. భూసేకరణకు రూ.484 కోట్లు, పునరావా రూ.184 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రణాళిక చేశామని, ఇంకా రూ.2,540 కోట్లు ఖర్చు చేస్తే కానీ వెలిగొండ పనులు పూర్తి కావని చంద్రబాబు తెలిపారు. గడచిన 20 నెలల్లో రూ.540 కోట్లు ఖర్చు చేసి పనులు వేగంగా చేపడుతున్నామని, రూ.456 కోట్లతో విలువైన ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభకు వచ్చానని చంద్రబాబు అన్నారు. గత పాలకులు ఐదేళ్లలో ఈ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు ఖర్చు చేసి పనులు అయిపోయాయని పంగ నామాలు పెట్టారని, ఎవరు మంచి చేస్తే వారికి అండగా నిలుస్తేనే ప్రజల జీవితాలు మెరుగవుతాయని చంద్రబాబు తెలిపారు.


Tags:    

Similar News