ఐర్లాండ్ లో ఏపీకి చెందిన విద్యార్థి మృతి

విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లి అక్కడ రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన విద్యార్థి మరణించారు

Update: 2025-02-03 02:24 GMT

విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లి అక్కడ రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన విద్యార్థి మరణించారు. ఆంధ్రప్రదేశ్ లోని జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి భార్గవ్ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. అయితే భార్గవ్ తన స్నేహితులతో కలసి బయటకు వెళుతుండగా కారు చెట్టుకు ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్గవ్ మరణించారు.

కారు ఢీకొని...
భార్గవ్ తండ్రి చిత్తూరు లో పనిచేస్తున్నారు. భార్గవ్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నింపింది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భార్గవ్ మృతదేహాన్ని భారత్ కు రప్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇటీవల ఐర్లాండ్ కు ఉద్యోగాల కోసం ఎక్కువ మంది యువకులు వెళుతున్నారు. అందులో భాగంగానే భార్గవ్ కూడా విదేశాల్లో ఉద్యోగం చేసి స్థిరపడాలని వెళ్లి అక్కడ అశువులు బాయడం పలువురిని కంటతడిపెట్టిస్తుంది.


Tags:    

Similar News