Andhra Pradesh : గుంటూరులో పొంగుతున్న వాగులు.. నదులు
గుంటూరు జిల్లాలో వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయి.
గుంటూరు జిల్లాలో వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయి. కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో నల్లమడ వాగులో పెరిగిన వరద ఉదృతి కొనసాగుతుంది. కాకుమాను మండలం కొండపాటూరు-అప్పాపురం వద్ద నల్లమడ వాగు కట్ట పై నుంచి వరద నీరు పొంగి పొర్లుతుంది. నల్లమడ వాగు కట్టలు పొంగి పొలాల్లోకి వరద నీరు చేరుతుంది. మూడు నాలుగు అడుగులు నల్లమాడ వాగు ఉద్ధృతి పెరిగింది.
నల్లమాడ వాడు ఉప్పొంగితే...
అప్పాపురం గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. వరద పెరిగితే కట్టలు తెగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నల్లమాడ వాగు ఉద్ధృతి మరో మూడు అడుగులు పెరిగితే కాకుమాను మండలం గార్లపాడు వద్ద కూడా ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడకు జిల్లా అధికారులు చేరుకుంటున్నారు.