నెల్లూరు జిల్లాకు నాదెండ్ల
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. మంత్రి నాదెండ్ల కి మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘన స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి ఆనం నివాసానికి విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్నిని మంత్రి ఆనం రామనారాయణరెడ్డిసాదరంగా ఆహ్వానించారు.
రెండు నియోజకవర్గాల్లో...
మంత్రి నివాసానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ బాబు , జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, ఎస్పీ కృష్ణ కాంత్ లు చేరుకున్నారు. జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై చర్చించేందుకు నేతలు, అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నెల్లూరు జిల్లా పర్యటన లో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సంగం, కోవూరు మండలాల్లో పర్యటించనున్నారు.