చంద్రబాబు తర్వాత నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరు..? ఆ సంకేతాలు నిజమేనా?

ఏపీలో టీడీపీకి అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుస కేసులు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సమస్యలతో సైకిల్‌ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

Update: 2023-09-13 05:00 GMT

ఏపీలో టీడీపీకి అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుస కేసులు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సమస్యలతో సైకిల్‌ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక వైపు టీడీపీకి కోర్టులో చుక్కెదురైంది. మరో వైపు కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఇప్పటికే రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అయితే సీఐడీ పిటిషన్‌పై ఎలాంటి తీర్పు వస్తుందోననే టెన్షన్‌ మొదలైంది. సీఐడీ కస్టడీ పిటిషన్‌పై ఈ రోజు ఏం జరుగుతోందనని ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు నాయుడు హౌస్‌మోషన్‌ పిటిషన్ నిన్న కోర్టు తిరస్కరించింది. ఇవన్ని కూడా టీడీపీ నేతలను టెన్షన్‌ పుట్టించేలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడును కస్టడీకి అప్పగించాలన్న పిటిషన్‌ను నిన్న కోర్టు ఈ రోజుకు వాయిదా వేసింది. మరి సీఐడీ పిటిషన్‌పై కోర్టు నుంచి సానుకూలమైన తీర్పు వస్తందా..?లేదా అన్నది ఉత్కంఠంగా మారింది.

ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత పార్టీకి గడ్డ పరిస్థితులు వచ్చాయన్నది విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే స్కిల్‌ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అన్నీ ఎదురుదెబ్బలే తగుతున్నాయి. దేశంలోనే పేరుమోసిన బడా లాయర్‌ను రంగంలోకి దింపినా.. ఫలితం ఉండటం లేదు. గంటకు లక్షలాది రూపాయలు తీసుకునే పెద్ద పెద్ద లాయర్ల నుంచి బయటపడుతామని భావిస్తున్న టీడీపీకి అన్ని చిక్కలే వచ్చి పడుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కటి కూడా అనుకూలంగా రావడం లేదు. పిటిషన్ల మీద పిటిషన్లు వేసినా, న్యాయస్థానంలో హోరాహోరీ వాదనలు వినిపించినా ఫలితం ఉండటం లేదు. రిమాండ్‌ తిరస్కరణ పిటిషన్‌, హౌస్ రిమాండ్‌ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టేయడంతో దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. ఒక వైపు టీడీపీ నేతలు అధికార పార్టీ వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నా.. టీడీపీ పంథం ఏ మాత్రం ఫలించడం లేదేనే చెప్పాలి. మరి ఈ రోజు ఏం జరుగుతుందో వేచి చూడాలి.

నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరు..?

ఇప్పటి చంద్రరబాబు నాయుడు జైల్లో ఉండగా, నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరన్నది జోరుగా చర్చ కొనసాగుతోంది. ఇక తదుపరి టార్గెట్‌ లోకేష్‌ అని సంకేతాలు వెలువడుతున్నాయి. స్కిల్‌ స్కామ్‌తోపాటు చంద్రబాబు మెడపై మరో రెండు కేసులు వేలాడుతున్నాయి. ఇక లోకేష్‌ను కూడా స్కిల్‌ స్కామ్‌ కేసు చుట్టుముట్టబోతోంది. ఇక కేసులు ముఖ్యమైన నేతలను చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక లైన్‌లో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు పేర్లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మంత్రి దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. త్వరలోనే ఈఎస్‌ఐ స్కామ్‌ తెరపైకి వస్తుందని, మాజీ మంత్రి యనమల అవినీతి లెక్కలు కూడా బయటికి వస్తాయంటూ చేసిన వ్యాఖ్యలు హట్‌ టాపిగ్గా మారాయి. చంద్రబాబుతోపాటు యనమల రామకృష్ణుడు కూడా జైలు ఊచలు లెక్క పెట్టే పరిస్థితులు వస్తాయంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
Tags:    

Similar News