గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ఆరుగురి అరెస్ట్

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు

Update: 2025-01-19 07:32 GMT

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈకేసులో మొత్తం 89 మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులోనే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా చేర్చారు. అరెస్టయిన ఆరుగురు నిందితులు కూడా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులే. గతంలోనూ ఇదే కేసులో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వల్లభనేని వంశీ కూడా నిందితుడే...
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ను ధ్వంసం చేయడమే కాకుండా బయట ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసులో నిందితులను వరసగా ఒక్కొక్కరినీ అదుపులోకి తీసుకుంటూ న్యాయస్థానంలో ప్రవేశపెడుతున్నారు.


Tags:    

Similar News