క్లైమాక్స్ కు చేరిన పరకామణి చోరీ కేసు..నేడు వైవీ సుబ్బారెడ్డి విచారణకు
పరకామణి చోరీ కేసులో సిట్ అధికారులు విచారణను వేగవంతం చేయనున్నారు
పరకామణి చోరీ కేసులో సిట్ అధికారులు విచారణను వేగవంతం చేయనున్నారు. నేడు సిట్ విచారణకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి హాజరుకానున్నారు. విజయవాడ సిట్ కార్యాలయానికి వైవీ సుబ్బారెడ్డి చేరుకుని విచారణకు హాజరుకానున్నారు. తిరుమలలోని పరకామణి కేసులో ఇప్పటికే కొందరిని సిట్ అధికారులు విచారించారు.
డిసెంబరు 2న కోర్టుకు నివేదిక...
టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి నేడు విచారణకు హాజరు కానున్నారు. ఈ విచారణను సీఐడీ చీఫ్ రవి శంకర్ అయ్యన్నార్ చేయనున్నారు. పరకామణి కేసులో ఎవరి ప్రమేయం ఉంది? బ్యాంకు లావాదేవీలు వంటి వాటిపై ఈ విచారణ సాగనుంది. డిసెంబరు 2వ తేదీన సీఐడీ అధికారుల కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. దీంతో పరకామణి చోరీ కేసు క్లైమాక్స్ కు చేరుకున్నట్లే కనిపిస్తుంది.