నేడు వైవీ సుబ్బారెడ్డి విచారణ

తిరుమల కల్తీ నెయ్యి కేసులో నేడు వైవీ సుబ్బారెడ్డి విచారణను సిట్ అధికారులు చేయనున్నారు

Update: 2025-11-20 04:14 GMT

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్‌ విచారణ కొనసాగుతుంది. నేడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఇంటికి సిట్ అధికారులు చేరుకుని విచారించనున్నారు. కల్తీ నెయ్యి కేసులో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే తాను హైదరాబాద్ నుంచి విజయవాడకు రాలేనని వైవీ సుబ్బారెడ్డి చెప్పడంతో వైవీ సుబ్బారెడ్డిని ఇంట్లోనే సిట్ అధికారులు విచారించనున్నారు.

వైవీ సుబ్బారెడ్డి ఇంట్లోనే...
తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నను అరెస్ట్ చేసిన నేపథ్యంలో కీలక విషయాలను ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని కూడా విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. అందుకే నేడు హైదరాబాద్ లో వైవీ సుబ్బారెడ్డిని విచారించనున్నారు.



Tags:    

Similar News