మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు

Update: 2025-04-15 08:40 GMT

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరారు. బీఎన్ఎస్ఎస్ 179 సెక్షన్ ప్రకారం ఈ నోటీసులను సిట్ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. లిక్కర్ స్కామ్ లో మీ వద్ద ఉన్న ఆధారాలను తమకు ఇవ్వాలని, విషయాలను చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

మద్యం స్కామ్ కేసులో...
విజయసాయిరెడ్డి ఇటీవల కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రమేయం పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మద్యం స్కామ్ లో కీలక పాత్ర పోషించారని, అతనిని విచారిస్తే పూర్తి విషయాలు తెలుస్తాయని ఆయన అన్న నేపథ్యంలో మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్న విజయసాయిరెడ్డికి సిట్ అధికారుల నోటీసులు జారీ చేశారు.


Tags:    

Similar News