పోలీసు అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సిద్ధార్థ్ కౌశల్ డీజీపీకి తన రాజీనామా లేఖ సమర్పించారు. స్వచ్ఛందంగానే తాను రాజీనామా చేస్తున్నానని సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు.
వైసీపీ హయాంలో...
వైసీపీ హయాంలో కడప, ప్రకాశం, కృష్ణా, కర్నూలు జిల్లాకు ఎస్పీగా పనిచేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్రాధాన్య పోస్టులో నియమించారు. అయితే తన రాజీనామా వెనక ఎవరి బలవంతం ఏమీ లేదని, స్వచ్ఛందంగానే తాను రాజీనామా చేస్తున్నానని, ఎవరి వత్తిడులు లేవనిఆయన ఒక లేఖను విడుదల చేశారు. డీజీ స్థాయి పోలీస్ అధికారి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్రభుత్వానికి, ప్రజలకు ఆయన ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.