Tirumala : తిరుమలకు నేడు వెళ్లే భక్తులు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గ లేదు.

Update: 2025-07-31 03:29 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గ లేదు. దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. వసతి గృహాలు కూడా భక్తులకు సరైన సమయంలో అందుబాటులోకి రావడం లేదు. వసతి గృహాల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముందుగా బుక్ చేసుకున్న వారు కూడా వసతి గృహాలు పొందాలంటే గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి రావడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నష్ట నివారణ చర్యలకు దిగారు.

శ్రీవాణి దర్శన టిక్కెట్లను...
రేపటి నుంచి శ్రీవాణి దర్శన టిక్కెట్లను ఆఫ్ లైన్ లో పొందిన భక్తులకు దర్శన సమయాల్లో మార్పులు చేశారు. రేపటి నుంచి ఆగస్టు 15వ తేదీ వరకూ ఏరోజుకు ఆరోజు శ్రీవాణి దర్శనం టోకెన్లను ఆఫ్ లైన్ లోనే జారీ చేయాలని నిర్ణయించారు. ఆన్ లైన్ లో ప్రసతుతం 1500 టిక్కెట్లు విక్రయిస్తుండగా, శ్రీవాణి దర్శనానికి మూడు రోజుల సమయం పడుతుంది. కొత్త పద్ధతిలో సంఖ్యలో మార్పు ఉండకపోయినా దర్శన వేళలను మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం పది గంటల నుంచి మొదటి వచ్చిన వారికి మొదట శ్రీవాణి టిక్కెట్లు జారీ చేస్తారు. దర్శన టిక్కెట్లు పొందిన వెయ్యి మందిని సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనానికి అనుమతిస్తారు.
పదిహేను గంటల సమయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పన్నెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశంచిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు నుంచి ఆరు గంటల సమయ పడుతుంది. మూడువందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,303 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,166 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.99 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News