Tirumala : నేడు కూడా తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానంఅధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. కంపార్ట్ మెంట్లలో భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా సలువుగా దర్శనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి భక్తుల దర్శనం ఎక్కువగా ఉంది. తిరుమలకు ఇటీవల కాలంలో దర్శనం చేసుకోవాలంటే గంటల సమయం పడుతుంది.
మూడు నెలల నుంచి...
గత మూడు నెలల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సీజన్ తో సంబంధం లేకుండా రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వసతి గృహాల కొరత లేకుండా భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలను, మజ్జిగ, మంచినీరు వంటివి పంపిణీ చేస్తున్నారు. తిరుమల అన్న ప్రసాదం కేంద్రం వద్ద కూడా రద్దీ ఎక్కువగానే కొనసాగుతుంది.
పద్దెనిమిది కంపార్టెమెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుఠం క్యూ కాంప్లెక్స్ లోని పద్దెనిమిది కంపార్టెమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం భక్తుుల వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఉదయం ఏడున్నర గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,183 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,906 మంది తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.89 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.