Tirumala : ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు క్యూ లైన్ ఎంత పొడుగు ఉందో తెలుసా?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువయింది

Update: 2025-06-08 02:53 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువయింది. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే కనిపిస్తుంది. అలిపిరి టోల్ గేట్ నుంచి ప్రారంభమయిన రద్దీ చివరకు శ్రీవారి దర్శనం వరకూ కొనసాగుతుంది. ఎక్కడ చూసినా తిరుమలలో భక్తుల రద్దీతో కొండ కిటకిటలాడుతుంది. అయితే భక్తుల ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తెలిపారు. సామాన్య భక్తులకు సత్వరం దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అందుకు అవసరమైన చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటుంది.

గత నెలలో భక్తులు...
తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమలలో సౌకర్యాలు పెరిగాయని భక్తులు చెబుతున్నారు. గత గత మే నెలలో 23.79 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.108 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మే నెలలోనే 1.62 కోట్ల లడ్డూలు భక్తులకు విక్రయించినట్లు అధికారులు వెల్లడించారు. రికార్డు స్థాయిలో 1.33 కోట్ల మంది అన్నప్రసాదాలు స్వీకరణ చేశారని అధికారులు తెలిపారు. ఈ నెల ఇంకా భక్తుల సంఖ్య పెరగడంతో మరింత ఆదాయం తిరుమలకు పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
శిలాతోరణం వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 88,257 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 45,068 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Tags:    

Similar News