YSRCP : నేను నెల్లూరు బిడ్డనే : విజయసాయిరెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
vijayasai reddy
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఎక్స్ లో చంద్రబాబుపై సెటైర్లు వేశారు. "విమర్శించడానికి మన దగ్గర ఆయుధాలేవీ లేనప్పుడు, బకెట్ల కొద్ది బురద చల్లాలి’ అనేది చంద్రబాబు అనే సూడో మేధావి సిద్ధాంతం" అని ఆయన అన్నారు.
తనపై తప్పుడు సమాచారాన్ని...
ఈ ఫార్ములాను ఆయన శిష్యగణం తూ.చా తప్పక పాటిస్తున్నారన్న విజయసాయిరెడ్డి, తది వైజాగ్ అని ఒకరు, ఢిల్లీ నుంచి వచ్చానని ఇంకొకరు రోజూ పిడకలు విసురుతున్నారన్నారు. నెల్లూరు తన జన్మభూమి అని, తాను పుట్టింది, చదువుకుందీ ఇక్కడేనని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తల్లి నుంచి బిడ్డను వేరు చేసే నీచపు ప్రచారం ఇకనైనా మానుకోవాలంటూ హితవు పలికారు.