బెజవాడ వాసులకు గుడ్ న్యూస్
విజయవాడ వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది
విజయవాడ వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. దీంతో బెంగళూరు వెళ్లే ప్రయాణికులు మాత్రమే కాకుండా తిరుపతి వెళ్లే ప్రయాణకులకు కూడా తీపి కబురే. విజయవాడ నుంచి తిరుపతికి నాలుగున్న గంటల్లో చేరుకునే అవకాశముంది. వందేభారత్ రైలు మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు నడవనుంది. ట్రైన్ నెంబర్ 20711తో విజయవాడలో ఇది ఉదయం 5.15 గంటలకు బయల్దేరి.. ఎస్‌ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరుకుంటుంది.
తిరుపతి నాలుగున్నర గంటలే....
అలాగే తిరుగు ప్రయాణంలో 20712 నెంబర్‌తో బెంగళూరులో మధ్యాహ్నం 14.45 గంటలకు ప్రారంభమయి విజయవాడకు 23.45 గంటలకు చేరుకుంటుందితెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, కృష్ణరాజపురం లను స్టాప్ లుగా నిర్ణయించారు. విజయవాడ నుంచి ఉదయం 5.15 గంటలకు బయలుదేరి తిరుపతికి ఉదయం 9.45 చేరుకోనుంది. ఇప్పటివరకు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లేవారికి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, మూడు రోజులు మాత్రమే నడిచే కొండవీడు ఎక్స్‌ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ వందేభారత్ రైలు రాకతో చాలా వరకూ కష్టాలు తీరినట్లే