BJP : ఏపీలో అరాచక ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో అరాచక, విద్వేషపూరిత పాలన నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి అన్నారు.

Update: 2023-11-18 11:33 GMT

ఆంధ్రప్రదేశ్ లో అరాచక, విద్వేషపూరిత పాలన నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీరు పై ఆమె విరుచుకుపడ్డారు. విజయవాడ లో ఎన్టీఆర్ జిల్లా మండల,పోలింగ్ బూత్, శక్తి కేంద్రాల సభ్యుల సమావేశంలో పురందేశ్వరి మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీలకు మాట్లాడే హక్కులేకుండా చేస్తున్నారన్నారు ఎవరైనా ప్రభుత్వం పై గళం విప్పితే కేసులు పెడుతున్న తీరును మనం చూస్తున్నామన్నారు.అనేక ప్రాంతాల్లో వైసీపీ నాయకులు ఇసుక ను దోచుకుంటూ.. కోట్లు కూడేసుకుంటున్నారు.అడిగిన వారిపై వ్యక్తిగత దూషణలు చేస్తూ.. వారిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఎస్సీ యువకుడు పురుగుమందు తాగిన ఘటనను పురందేశ్వరి ప్రస్దావిస్తూ రాష్ట్ర హోంమంత్రి నియోజకవర్గంలోనే ఒక ఎస్సీ యువకుడు పురుగుల మందు తాగి చనిపోయాడని, ఈ సంఘటనకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ఆమె ప్రశ్నించారు.

ఇసుక మాఫియా...
వైసీపి పార్టీ సామాజిక బస్సు యాత్ర చేసిందని, అయితే దొమ్మేరులో ఎస్సీవర్గానికి చెందిన యువకుడు పురుగుమందు తాగిన ఘటనకు మీ యాత్ర ఏం సంకేతం ఇస్తోందని ప్రశ్నించారు. ఈ తరహా పాలనను అరాచక పాలన అనరా అంటూ తీవ్ర స్వరంతో ప్రభుత్వం పై మండిపడ్డారు.రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తోందని, రాజమహేంద్రవరం కడియం మండలం లో గోదావరి నదీ గర్భంలో అడ్డగోలుగా యంత్రాలతో ఇసుక తవ్వే స్తున్నారని తాను స్వయంగా కార్యకర్తల తో వెళ్లి చూడడం జరిగిందన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ అని చెప్పుకునే జగన్ ఆ కుటుంబానికి ఏమి న్యాయం చేశారని ప్రశ్నించారు.రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను, మోడీ చేసిన మేలును ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి అంటూ పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేసుకుంటే మనం ధీటుగా నిలబడాలన్నారు.


Tags:    

Similar News