లోకేష్ ఎడ్లబండిని లాగుతూ

నారాలోకేష్ ఆధ్వర్యంలో ఎడ్లబండి కాడె మోస్తూ నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Update: 2022-09-19 04:59 GMT

అసెంబ్లీ సమావేశాలు జరిగే ప్రతి రోజూ ఏదో ఒక అంశంపై తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ వస్తుంది. ఈరోజు రైతు సమస్యలపై టీడీపీ ఆందోళన ేసింది. మందడం గ్రామం నుంచి అసెంబ్లీ వరకూ ఎడ్ల బండ్లపై ర్యాలీగా వెళదామని భావించారు. కానీ ఎండ్ల బండ్లపై ర్యాలీని పోలీసులు అంగీకరించలేదు. పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేసి నేతలను గృహనిర్భంధంలో ఉంచారు. ఎడ్ల ను తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అసెంబ్లీ వరకూ...
దీంతో నారాలోకేష్ ఆధ్వర్యంలో ఎడ్లబండి కాడెను మోస్తూ నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీ వరకూ నిరసన ర్యాలీని చేపట్టారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద వరకూ ఎడ్ల బండిని లాక్కుంటూ వెళ్లారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీడీపీ నేతలు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు.


Tags:    

Similar News