Andhra Pradesh : ఏపీలో డు ప్రయివేటు పాఠశాలలు బంద్

ఆంధ్రప్రదేశ్ లో నేడు ప్రయివేటు పాఠశాలలు బంద్ ను పాటిస్తున్నాయి. ప్ర

Update: 2025-07-03 02:05 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేడు ప్రయివేటు పాఠశాలలు బంద్ ను పాటిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష చర్యలకు నిరసనగా పాఠశాలల యాజమాన్యం నిరసన తెలియజేయడంలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేటు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఏపీ ప్రయివేటు పాఠశాలల యాజమాన్య సంఘం తెలిపింది. తమ ఆవేదనను తెలియజేయడానికి మాత్రమే ఈ నిరసనను తెలియజేస్తున్నామని చెప్పింది. అధికారుల వేధింపులతో పాటు హెచ్చరికలు తమను ఆవేదనకు గురి చేస్తున్నాయని పాఠశాలల యాజమాన్యం ఆరోపిస్తుంది.

వేధింపులకు గురి చేయడంతో...
పాఠశాలలను నిత్యం తనిఖీలు చేయడంతో పాటు ఆర్టీఈ ప్రవేశాలలో తగిన ధ్రువీకరణ లేకుండా చేర్చుకోవాలని బలవంతం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమకు షోకాజ్ నోటీసులు ఇచ్చి గుర్తింపు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఒకరోజు అన్ని ప్రయివేటు పాఠశాలలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు మాత్రం నేడు యధావిధిగా నడుస్తాయి.


Tags:    

Similar News