Narendra Modi : నేడు పుట్టపర్తికి ప్రధాని

నేడు శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకుంటారు

Update: 2025-11-19 01:51 GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. నేడు శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకుంటారు. పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా బాబా మందిరంతో పాటు మహా సమాధిని కూడా ప్రధాని మోదీ సందర్శిస్తారు. అనంతరం బాబా స్మారక నాణేన్ని విడుదల చేస్తారు.

బాబా శత జయంతి ఉత్సవాల్లో...
ప్రత్యేకంగా పోస్టల్ స్టాంప్ ను కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు, ఉన్నతాధికారులు పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రధాని రాక సందర్భంగా పుట్టపర్తిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు.


Tags:    

Similar News