Narendra Modi : పుట్టపర్తిలో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు.

Update: 2025-11-19 05:53 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. ముందుగా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లి సత్యసాయి బాబా మహా సమాధిని మోదీ దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ప్రశాంతి నిలయంలో...
ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రధాని ఎదుట సత్యసాయి భక్త బృందం ప్రదర్శించింది. ఈ కార్యక్రమానికి ఐశ్వర్య రాయ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీ సత్యసాయి బాబా పోస్టల్ స్టాంప్, నాణేన్ని విడుదల చేయనున్నారు.  వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. 


Tags:    

Similar News