Narendra Modi : పుట్టపర్తి ఆథ్యాత్మిక భూమి : ప్రధాని

సత్యసాయి బాబా ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు

Update: 2025-11-19 07:14 GMT

సత్యసాయి బాబా ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ బాబా బోధనలు చాలా మంది జీవితాలను మార్చేశాయని చెప్పారు. కోట్లాది మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పుట్టపర్తి ఆధ్మాత్మిక భూమిగా ప్రధాని అభివర్ణించారు. ప్రేమ, సేవకు సత్యసాయిబాబా ప్రతిరూపంగా నిలిచారని అన్నారు. బాబా సేవే పరమావధిగా పనిచేశారని అన్నారు. బాబా బోధనలు దేశమంతా ప్రభావం చూపాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా పేదలకు రక్షిత తాగు నీటిని అందించారని అన్నారు.

సేవా సర్వో ధర్మ:
శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. భక్తి, జ్ఙానం, ప్రేరణ అనేవి సేవతోనే ముడిపడి ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గోమాతలను సంరక్షించడం మన ధర్మంగా భావించాలని మోదీ పిలుపు నిచ్చారు. సత్యసాయి భౌతికంగా లేకున్నా ఆయన ప్రేమ మనతో ఉందని అన్నారు. బాబా జీవితం వసుధైక కుటుంబం అన్న రీతిలో సాగిందని ప్రధాని నరేంద్ర మోదీ చెపపారు. గతంలో రాయలసీమలో తాగునీటి కష్టాలుండేవని, దానిని బాబా తొలగించారని అన్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందచేస్తూ శ్రీ సత్యసాయి ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు.

























Tags:    

Similar News