Tirumala: తిరుమలలో రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నిన్న తిరుమలకు చేరుకున్న ద్రౌపది ముర్ముకు ఆలయ అధికారులు, పాలక మండలి ప్రత్యేక స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం ఏడు కొండల వాడిని దర్శించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం అందచేశారు.
వరాహ స్వామిని దర్శించుకుని
అనంతరం వేద పండితులు స్వామి వారి ప్రసాదాలను అందచేవారు. ముందుగా క్షేత్ర సంప్రదాయం అనుసరించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరాహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల ఏడుకొండల వాడి దర్శనానికి వెళ్లారు.రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుమలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా రాష్ట్రపతి పర్యటన సాగింది.