వర్మకు మళ్లీ నోటీసులు

వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసుల నోటీసులు జారీ చేశారు.

Update: 2025-01-29 03:09 GMT

వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసుల నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 4వ తేదీన విచారణకు రావాలని రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. గతంలో సోషల్ మీడియాలో అనుచితమైన పోస్టులు పెట్టినందుకు రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్ లోని అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయిన సంగతి తెలిసిందే.

విచారణకు రావాలంటూ...
ఈ కేసులో విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ లపై ఆయన పెట్టిన పోస్టింగ్ పై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఏపీలోని పలు స్టేషన్లపై కేసులు నమోదుకావడంతో ఆయన హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.


Tags:    

Similar News