నేడు విశాఖలోమంత్రి గొట్టిపాటి పర్యటన

నేడు విశాఖలో విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించనున్నారు

Update: 2025-06-27 02:46 GMT

నేడు విశాఖలో విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించనున్నారు. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ భవనాన్ని మంత్రి గొట్టిపాటి ప్రారంభించనున్నారు. పునరుత్పాదక విద్యుత్తుతో ఈసీబీసీ భవనం పనిచేయనుందని అధికారులు తెలిపారు. 50 శాతం విద్యుత్తు ఆదా అయ్యేలా భవన నిర్మాణం చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

విద్యుత్తు శాఖ కార్యక్రమాల్లో...
మొత్తం పథ్నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా భవనాన్ని ఈపీడీసీఎల్ నిర్మించింది. అనంతరం మంత్రి గొట్టి పాటి రవికుమార్ పెద్దవాల్తేరులో భవనాన్ని సందర్శించి..19 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ సందర్బంగా టీడీపీ స్థానిక నేతలతో మంత్రి సమావేశమయ్యే అవకాశముంది.


Tags:    

Similar News