బెజవాడలో మావోయిస్టుల కలకలం

విజయవాడలోని ఒక భవనంలో ఇరవై ఏడు మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు

Update: 2025-11-18 07:48 GMT

విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. విజయవాడలోని ఒక భవనంలో ఇరవై ఏడు మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కానూరులోని ఆటోనగర్ లో ఉన్న భవనంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారని విజయవాడ కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులకు సమాచారం అందడంతో ఆపరేషన్ సాగుతుంది. అయితే ఇప్పటికే ఆరుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.మావోయిస్టులు షెల్టర్ జోన్ గా ఎంచుకున్న భవనం చుట్టూ ఆక్టోపస్ బలగాలు చుట్టుముట్టాయి.

సెర్చ్ ఆపరేషన్...
చుట్టు పక్కల భవనాలపైకి ఎక్కి పహారా కాస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. వారి వద్ద భారీగా ఆయుధాలు ఉన్నాయన్న సమాచారంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. భవనం చుట్టూ ఆక్టోపస్ బలగాలతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మొహరించాయి. వారిని లొంగిపోవాలని మైకుల్లో కోరుతున్నారు. మరొకవైపు చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఖాళీ చేయిస్తుండటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.


Tags:    

Similar News