Perni Nani: చంద్రబాబు, పవన్‌ వ్యాఖ్యలపై పేర్ని నాని కౌంటర్‌

ఏపీ రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో వివిధ పార్టీల నేతలు ఒకరిపై..

Update: 2024-03-01 06:23 GMT

Perni Nani

Perni Nani:ఏపీ రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో వివిధ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలకు దిగుతున్నారు. వైసీపీ రంగంలోకి దిగుతుండగా, జెండా చేతపబట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ అటు తాడేపల్లిగూడెం వేదికగా టీడీపీ, జనసేన గర్జించింది. అధికార పార్టీ టార్గెట్‌గా చంద్రబాబు, పవన్ తమదైన శైలిలో నిప్పులు చెరిగారు. అయితే జెండా సభ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలకు అధికార పార్టీ నేతలు అంతకు మించి కౌంటర్లు ఇస్తున్నారు.

పవన్ పలికిన ప్రతి పదానికీ తమదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు మాజీ మంత్రి పేర్నినాని. యుద్ధం ఎలా ఉంటుందో మున్ముందు చూపిస్తామని అన్నారు. 2014, 2019లో ఏం చేశారంటూ పేర్ని నాని ప్రశ్నించారు. తాడేపల్లి సభను పవన్, చంద్రబాబు వైఎస్ జగన్ ను తిట్టడానికే పెట్టారంటూ వ్యాఖ్యానించారు. ప్రజలకు సందేశం ఇచ్చే బదులు.. జగన్ ను దూషించడానికే సభను పెట్టారంటూ వివరించారు. 24 సీట్లకే పవన్ సరిపెట్టుకోవడంపైనా పేర్ని కౌంటర్ ఇచ్చారు. వామనుడిలా వైసీపీని తొక్కేస్తానని పవన్ అంటే.. దానం చేసిన వాళ్లెవరూ, తొక్కేదెవరినీ అంటూ పేర్కొన్నారు. జగన్ ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఘటనలపై పవన్ విమర్శలు చేస్తే.. మీ సంగతి ఏంటో చూసుకోండంటూ పేర్ని నుంచి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇలా ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో విమర్శలు, ప్రతివిమర్శలు జోరందుకున్నాయి. చంద్రబాబు, పవన్‌లు ఎంత ప్రయత్నించినా.. గెలిచేది వైసీపీనేనని వ్యాఖ్యనిస్తున్నారు వైసీపీ నేతలు.

ఇదిలా ఉండగా, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఓ వైపు అభ్యర్థులపై క్లారిటీ.. మరోవైపు సభలు, సమావేశాలు.. ఇంకోవైపు మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టాయి అన్ని పార్టీలు.   ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించే విధంగా మేనిఫెస్టోను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో మరోసారి పగ్గాలు చేపట్టాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. 

Tags:    

Similar News