Perni nani : కల్తీ మద్యంపై పేర్ని నాని ప్రశ్నలివే?

కల్తీ మద్యం పై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు

Update: 2025-10-17 07:04 GMT

కల్తీ మద్యం పై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన క్యూ ఆర్ కోడ్ ను తొలగించి ఈ పదహారు నెలల నుంచి యధేచ్ఛగా కల్తీ మద్యం విక్రయాలకు పాల్పడ్డారన్నారు. కల్తీ మద్యం బయటపడిన వెంటనే ఇప్పుడు క్యూ ఆర్ కోడ్ తీసుకు వచ్చారని అన్నారు. బెల్ట్ షాపుల్లోనూ, పర్మిట్ రూమ్ ల్లో క్యూ ఆర్ కోడ్ ను ఎవరు స్కాన్ చేసుకుంటారని పేర్ని నాని ప్రశ్నించారు. ఏడాదిన్నతర్వాత క్యూ ఆర్ కోడ్ తీసుకు వచ్చారంటే అప్పటికే కల్తీ మద్యాన్ని విక్రయించుకునేలా ప్రభుత్వం సహకరించిందన్నారు.

జయచంద్రారెడ్డిని ఎందుకు?
రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులకు పర్మిట్ రూంలు పెట్టారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు నాయుడు 1,50 లక్షల పై చిలుకు బెల్ట్ షాపులు రాష్ట్రంలో ఉన్నాయని ఆయనే ఒప్పుకున్నారని పేర్ని నాని అన్నారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. ములకలచెరువులో కల్తీ మద్యం బయటపడటంతో ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని ప్రజలకు అర్థమయిందని పేర్ని నాని అన్నారు. జయచంద్రారెడ్డిని ఎందుకు ఈ కేసులో అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. సురేంద్ర నాయుడు దొరకలేదా? అని నిలదీశారు. అసలు నిందితులను అరెస్ట్ చేయకుండా వైసీపీ నేతలపై నేరం మోపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.


Tags:    

Similar News