షర్మిల కాంగ్రెస్ లో చేరడంపై పేర్ని నాని స్పందన ఇదే

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల ఇటీవలే

Update: 2024-01-06 02:57 GMT

perni nani about ys sharmila joining in congress party

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె 2021లో తెలంగాణలో తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీకి, తమకు ఎటువంటి సంబంధం లేదని వైసీపీ నేతలు చెప్పడం అప్పట్లో సంచలనమైంది.. అలాగే ఓ టీవీ ఇంటర్వ్యూలో షర్మిల వైసీపీ నేతల మాటలు బాధించాయని కూడా తెలిపారు. ఇక ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో ఆమె, ఆమె పార్టీ పోటీ చేయలేదు. చివరికి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆమె ఇష్టమన్నారు. చంద్రబాబుకి హరికృష్ణ, ఎన్టీఆర్ వ్యతిరేకం కాదా అంటూ ప్రశ్నించారు. పురంధేశ్వరి వ్యతిరేకం కాదా?.. చంద్రబాబు సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ లో చేరి పని చేశారా లేదా? అని ప్రశ్నించారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు చంద్రబాబు మీద పుస్తకం రాశారని పేర్ని నాని గుర్తు చేశారు. చంద్రబాబు రా కదలి రా అని సభ పెట్టారని.. ఎవరు కదలి రావాలి? ఎందుకు రావాలని ఆయన ప్రశ్నించారు. పగవాడికి కూడా చంద్రబాబుకి పట్టిన దుర్గతి పట్టకూడదన్నారు. పవన్, చంద్రబాబుకి పిచ్చి మాటలు చెప్పే అలవాటు ఉందన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో నిత్యావసరాల ధరలు తగ్గించారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. పవన్, చంద్రబాబు 2014లో ఇంటికో ఉద్యోగం అన్నారని, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నలు గుప్పించారు. చంద్రబాబు బీసీలకు ఏం చేశారని ప్రశ్నించారు. మైనార్టీల ఓట్లు కావాలి, కానీ ఐదేళ్లలో మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు.


Tags:    

Similar News