Andhra Pradesh : ఏపీలో నేడు పింఛన్ల పంపిణీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది

Update: 2025-11-01 01:53 GMT

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది. ఉదయం ఏడు గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతుంది. నేరుగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు పదహారు నెలల నుంచి ప్రతి నెల ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ జరుగుతుంది.

నిధులు విడుదల చేసి...
ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై రేపటి వరకూ ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వృద్ధులు, వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు, మంచానికే పరిమితమైన దివ్యాంగులకు పదిహేను వేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిధులను ప్రభుత్వం నిన్ననే విడుదల చేయడంతో నేటి ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది. దాదాపు అరవై ఐదు లక్షల మందికి ఈ పింఛన్లను అందిస్తున్నారు.


Tags:    

Similar News