ఏపీ విద్యా విధానం చుట్టు రాజకీయ ప్రకంపనలు

ఏపీలో విద్యా విధానంపై తీసుకుంటున్న నిర్ణయాల చుట్టూ రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో..

Update: 2023-10-22 10:40 GMT

ఏపీలో విద్యా విధానంపై తీసుకుంటున్న నిర్ణయాల చుట్టూ రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యం అంటూ ఇంగ్లీష్ మీడియంతో పాటు బైజూస్ కంటెంట్.. 3వ తరగతి పిల్లలకు టోఫెల్ శిక్షణ లాంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. అయితే ఈ విధానాల్లో ఏదో లోపముందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆరోపిస్తున్నారు. మూడవ వతరగతి పిల్లలకు నిజంగా టోఫెల్ అవసరమా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇంగ్లీష్ రాకపోతే ఇక బతుకే లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

పిల్లలు చదువుతుంటే ఎందుకు పవన్‌కి అక్కసు ఎందుకని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. ఇలాంటి ప్రతిపక్ష నాయకుల వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.ఎవరేమి అనుకున్నా కార్పొరేట్ స్కూళ్లలో విద్యార్ధులకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధులను తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి బొత్స. ఇలా ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి టోఫెల్ శిక్షణ వరకు అన్ని అంశాలపైనా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఎవరేమి అనుకున్నా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే తమ విధానమంటోంది ప్రభుత్వం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి ఒక మంచి ప్రవర్తన ఏర్పడేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు.

Tags:    

Similar News