Pawan Kalyan : పవన్ పై తెలంగాణ ఆగ్రహం.. వెనక్కు తీసుకుంటారా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి

Update: 2025-12-02 07:56 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన రాజోలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో అగ్గిని రాజేశాయి. కోనసీమలో కొబ్బరిచెట్లు ఎండిపోవడానికి తెలంగాణ రాష్ట్రం దిష్టితగలడమేనన్న పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ప్రజలను అవమానపర్చడమేనంటూ నేరుగా పవన్ కు వార్నింగ్ లు ఇస్తున్నారు. కోనసీమ కొబ్బరి చెట్లు ఎండి పోవడానికి ఓఎన్జీసీ సంస్థ డ్రెడ్జింగ్ కారణమని ఒకవైపు అక్కడి రైతులు చెబుతున్నప్పటికీ పవన్ కల్యాణ్ మాత్రం ఏదో ఒక విషయం మాట్లాడాలని అనిపించి మాట్లాడారు. తెలంగాణ ప్రజలను అవమానించాలన్న ఉద్దేశ్యంతో చేయకపోయనప్పటికీ అవి కాకరేపుతున్నాయి.

బేషరతుగా క్షమాపణ చెప్పాలని...
దాదాపు నలభై ఏళ్ల నుంచి ఈ సమస్య ఉందని అక్కడి రైతులు చెబుతున్నారు. అంటే రాష్ట్ర విడిపోయింది 2014లో మాత్రమే. పవన్ కల్యాణ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడారంటూ కొందరు రాజకీయ నేతలు నేరుగా ఆయనపై విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ను తెలంగాణ రాజకీయ నేతలు ఒకరకంగా టార్గెట్ చేసినట్లయింది. పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం క్షమాపణ చేసే ఉద్దేశ్యంలో మాత్రం లేనట్లు కనిపిస్తుంది. అయితే ఆయన ఈ రగడ మరింత ఎక్కువ కాకుండా ఉండేందుకు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే అవకాశాలున్నాయి.
కాంగ్రెస్ మంత్రులు...
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే పవన్ కల్యాణ్ సినిమాలు తెలంగాణలో విడుదల కానివ్వబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజల దిష్టికాదని, ఆంధ్రపాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం నీటిని తాగారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంత్రిగా చెబుతున్నా క్షమాపణలు చెప్పకుంటే పవన్ సినిమా తెలంగాణలో ఒక్క థియేటర్ లో కూడా విడుదల కాదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మంత్రిగా అనుభవం లేకనే ఇటువంటి వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ చేస్తున్నారన్నారు. తన సోదరుడు చిరంజీవిని చూసి నేర్చుకోవాలని అంటున్నారు. పవన్ కల్యాణ్ తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతల విమర్శలపై ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News