Pawan Kalyan : గత పాలకుల వల్లనే ఈ కష్టాలు
గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే కొబ్బరి రైతులు నష్టపోయారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే కొబ్బరి రైతులు నష్టపోయారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన సముద్ర జలాలతో నష్టపోయిన కొబ్బరి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, కేవలం సంక్షేమంపైనే దృష్టి పెట్టిందని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో తీసుకెళుతుందని తెలిపారు.
ఆర్థిక నష్టాల నుంచి...
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితాలను నేడు అనుభవిస్తున్నామని తెలిపారు. ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. ఆర్థికంగా రాష్ట్రం చాలా నష్టపోయిందని తెలిపారు. రహదారులను కూడా నిర్మించలేదని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు అభివృద్ధి, అటు సంక్షేమంపైనే దృష్టి పెట్టి పాలన సాగిస్తుందని తెలిపారు