Chandrababu : నేడు చంద్రబాబుతో భేటీ కానున్న పార్వతీపురం ఎమ్మెల్యే
నేడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర సమావేశం కానున్నారు
నేడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈరోజు పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు.నిన్న ఇద్దరి ఎమ్మెల్యేలతో సమావేశమై నియోజకవర్గాల సమస్యలపై చర్చించిన చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ 21 మంది ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
వరస సమావేశాలతో...
వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతంపై సమావేశాల్లో చర్చిస్తున్నారు. ప్రధాన సమస్యలు, గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు అమలు కాకుంటే వాటిని పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలకు పరిష్కారం వంటి అంశాలపై చర్చలు జరుపుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చిస్తున్నారు.