జనసేన నేతలకు హైకమాండ్ కీలక సూచన
జనసేన నేతలకు పార్టీ అధినాయకత్వం అంతర్గత సమాచారాన్ని పంపింది. ఎన్నికల వ్యూహాలు, పొత్తులపై ఆందోళన వద్దని పేర్కొంది.
peddapuram ambati oils
జనసేన నేతలకు పార్టీ అధినాయకత్వం అంతర్గత సమాచారాన్ని పంపింది. ఎన్నికల వ్యూహాలు, పొత్తులపై ఆందోళన వద్దని పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ చెప్పారని, దానికి కట్టుబడుతూ నిర్ణయం ఉంటుందని తెలిపింది. పవన్ కల్యాణ్ ప్రకటన చేసినప్పటి నుంచి వైసీపీ మైండ్‍గేమ్ ఆడుతోందని అంతర్గత సమాచారంలో వెల్లడించారు. ఎవరూ పొత్తుల విషయంపై మాట్లాడవద్దని కూడా తెలిపింది.
ఎవరూ నమ్మొద్దు...
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో గందరగోళానికి పార్టీ కార్యకర్తలు, నేతలు గురికావొద్దని జనసేన అధినాయకత్వం సూచించింది. సార్వత్రిక ఎన్నికల్లో తీసుకునే నిర్ణయాలను పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటిస్తారని పేర్కొంది. పొత్తులతో ముందుకెళ్తారా? లేదా? అన్న విషయమై ఆందోళన వద్దని తెలిపింది. వాటిని పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని జనసేన నేతలకు దిశా నిర్దేశం చేసింది.