బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజును పార్టీ నాయకత్వం ఎంపిక చేసింది
somu fires on chandra babu
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజును పార్టీ నాయకత్వం ఎంపిక చేసింది. పార్టీ సీనియర్ నేతకు అవకాశమివ్వాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏపీలో మొత్తం ఎమ్మెల్యే కోటా కింద ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, ఒకటి బీజేపీ, మరొకటి జనసేన, మిగిలిన మూడింటిని టీడీపీ తీసుకుంది.
ఐదుగురుపేర్లను పరిశీలించినా...
అయితే ఈరోజు ఉదయంవరకూ బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు. మొత్తం ఐదుగురు అభ్యర్థుల పేర్లను పరిశీలించినా పార్టీ అధ్యక్షుడిగా గతంలో పనిచేసి ఉండటంతో పాటు బీజేపీలోనే నమ్ముకుని ఉండటం కూడా సోము వీర్రాజుకు కలసి వచ్చిందని చెప్పాలి. అదే సయమంలో ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన సోము వీర్రాజును ఎంపిక చేయడంతో ఆయన మరికాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు.