వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి
వైసీపీలోని వివిధ అనుబంధ సంఘాలకు ఆ పార్టీ నాయకత్వం అధ్యక్షులను నియమించింది
వైసీపీలోని వివిధ అనుబంధ సంఘాలకు ఆ పార్టీ నాయకత్వం అధ్యక్షులను నియమించింది. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అన్ని అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్ధరెడ్డిని నియమించారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ పోతుల సునీత, బీసీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎస్‌టీ సెల్ అధ్యక్షురాలిగా శ్రీమతి మత్సరస వెంకట లక్ష్మి రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డి నియమితులయ్యారు. విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమించారు.
22 విభాగాలకు...
వైఎస్సార్ టీయూసీ అధ్యక్షుడిగా పూనూరి గౌతమ్ రెడ్డి నియమితులయ్యారు. సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉషలను నియమించారు. మొత్తం 22 విభాగాలకు అధ్యక్షులను నియమించారు. ఎన్నికలకు ముందు పార్టీ అనుబంధ విభాగాలను మరింత శక్తిమంతం చేయడానికి అధ్యక్షులను నియమించారు. వెంటనే ఆ యా అనుబంధ సంఘాలు పార్టీ శ్రేణులతో కలసి వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని వైసీపీ అధినాయకత్వం ఆదేశించింది.