Andhra Pradesh : నేడు పాక వెంకట సత్యనారాయణ నామినేషన్
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడిగా నేడు బీజేపీకి చెందిన పాక వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడిగా నేడు బీజేపీకి చెందిన పాక వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. భీమవరానికి చెందిన పాక వెంకట సత్యనారాయణను అనూహ్యంగా బీజేపీ ఎంపిక చేసింది. పాక వెంకట సత్యనారాయణ బీజేపీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనను ఎంపిక చేయడంతో బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన వారికి పదవులు ఇస్తున్నట్లయింది.
నేడు తుది గడువు...
నేడు రాజ్యసభ ఎన్నికకు సంబంధించి నామినేషన్ కు తుదిగడువు కావడంతో పాక వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకూ మాత్రమే తుదిగడువు కావడంతో ఆయనతో పాటు న్యాయవాదులు, బీజేపీ నేతలు వచ్చి నామినేషన్ వేయనున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరగనున్ననేపథ్యంలో పాక వెంకట సత్యనారాయణను బీజేపీ ఎంపిక చేసింది.