మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయంలో పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు

Update: 2023-04-11 06:39 GMT

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయంలో పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. పూలే ఆశయాలను తమ ప్రభుత్వం నెరవేరస్తుందని సీఎం జగన్ ఆ సందర్భంగా అన్నారు. సామాజిక న్యాయం జరపడమే పూలే లక్ష్యమని, ఆ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని వైఎస్ జగన్‌ అన్నారు.

ఈ కార్యక్రమంలో...
ఈ కార్యక్రమంలో పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులర్పించిన వారిలో బీసీ సంక్షేమం, ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.


Tags:    

Similar News