బుగ్గమఠం భూముల సర్వే ప్రారంభం
తిరుపతిలో నేడు బుగ్గమఠం భూముల సర్వే అధికారులు ప్రారంభించారు.
తిరుపతిలో నేడు బుగ్గమఠం భూముల సర్వే అధికారులు ప్రారంభించారు. 16వ ఆర్థిక సంఘం పర్యటన దృష్ట్యా గత నెలలో వాయిదా పడిన సర్వే ఈరోజు తిరిగి సర్వే ప్రారంభించారు. బుగ్గమఠం భూములు పెద్దయెత్తున ఆక్రమణలకు గురయ్యాయని ఆరోపణలు రావడంతో అధికారులు న్యాయస్థానం ద్వారా ఆదేశాలు తెచ్చుకునిసర్వేను ప్రారంభించారు.
ఆక్రమిత భూములను...
ఆక్రమిత భూముల సర్వే కోసం ఏప్రిల్ 11న దేవదాయ శాఖ నోటీసులు జారీచేసింది.మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరో నలుగురికి నోటీసులు ఇచ్చింది. ఆ భూములతో తనకు సంబంధం లేదన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సోదరుడు ద్వారకానాథరెడ్డి కొనుగోలు చేశారని వివరణ ఇచ్చారు.అయితే భూముల సర్వేను స్థానికులు,పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకునేప్రయత్నం చేయడంతో పోలీసు బందోబస్తు మధ్య సర్వే నిర్వహిస్తున్నారు.