నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Update: 2025-07-23 03:20 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం పది గంటలకు విజయవాడ నోవోటెల్‌కు చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఉదయం 10.10 గంటలకు నోవోటెల్‌లో జరిగే వివిధ దేశాల పెట్టుబడిదారుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు.

వివిధ శాఖలపై...
అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాత్రి ఏడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.


Tags:    

Similar News