Chadnrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

Update: 2025-07-11 02:19 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు ప్రసంగించనున్నారు. జనాభా తగ్గుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ నలుగురు పిల్లలు కనాలని చంద్రబాబు పదే పదే చెబుతుండటంతో ఈ ప్రకటన నేడు చేసే అవకాశముంది.

హైదరాబాద్ కు వెళ్లి...
ముఖ్యంగా యువత సంఖ్య తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తుందని పలు సభలు, సమావేశాల్లో చంద్రబాబు చెబుతుండటంతో నేడు దానిపై ప్రకటన చేసే అవకాశముంది. సచివాలయం వద్ద జరిగే ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం రెండు గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరివెళతారు. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ నుంచే చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లే అవకాశముంది.


Tags:    

Similar News