Andhra Pradesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్...హైకోర్టులో 1620 పోస్టులకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో హై కోర్టులో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది

Update: 2025-05-18 03:04 GMT

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. హై కోర్టులో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. మొత్తం 1,620 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంటర్, టెన్త్, 7వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 2025 జులై 1వ తేదీ నాటికి 18 - 42 ఏళ్లు వయోపరిమితి కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు https://aphc.gov.in/recruitments.php వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు.


పోస్టు పేరు- ఖాళీలు

1. స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-3): 80
2. జూనియర్ అసిస్టెంట్: 230
3. టైపిస్ట్: 162
4. ఫీల్డ్ అసిస్టెంట్: 56
5. ఎగ్జామినర్: 32
6. కాపీస్ట్: 193
7. డ్రైవర్(లైట్ వెహికిల్): 28
8. రికార్డ్ అసిస్టెంట్: 24
9. ప్రాసెస్ సర్వర్: 164
10. ఆఫీస్ సబార్డినేట్: 651
మొత్తం ఖాళీల సంఖ్య: 1620


Tags:    

Similar News