మైనింగ్ నుంచి తప్పుకుంటున్నా : వేమిరెడ్డి

నెల్లూరు తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

Update: 2025-07-31 03:14 GMT

నెల్లూరు తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మైనింగ్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని ప్రకటించారు. క్వార్జ్ ఫ్యాక్టరీ నిర్మాణ ఆలోచన విరమించుకుంటున్నానని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని మైనింగ్ అక్రమాలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకన్నారు.

క్వార్జ్ ఫ్యాక్టరీ నిర్మాణ ఆలోచనను...
తనకు మైనింగ్ చేసే ఉద్దేశ్యమే లేదన్నారు. అలాగే క్వార్జ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలన్న ఆలోచనను కూడా విరమించుకుంటున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలకు, స్వపక్షంలోని తనకు వ్యతిరేకులైన వారికి అవకాశమివ్వకూడదని పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు.


Tags:    

Similar News