కోటంరెడ్డికి షాక్ ఇచ్చిన కార్యకర్తలు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ నుంచి రెండు వందల మంది కార్యకర్తలు వైసీపీలో చేరారు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ నుంచి రెండు వందల మంది కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలాకాలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీడీపీ నుంచి వైసీపీలో చేరడం పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో రెండు వందల మంది కీలక కార్యకర్తలు వైసీపీలో చేరారు.
ఏడు నెలల పాలనలో...
పార్టీలో చేరిన వారికి వైసీపీ నేత ఆనం విజయకుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని వదిలేయడమే కాకుండా, పేదలకు వ్యతిరేకమైన నిర్ణయాలను తీసుకుంటున్నందున తాము పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. మరోవైపు కోటంరెడ్డిపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.