నేడు జగన్ వద్దకు నెల్లూరు పంచాయతీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు నేడు నెల్లూరు నేతల పంచాయతీ రానుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు నేడు నెల్లూరు నేతల పంచాయతీ రానుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహారాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఆయన టీడీపీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు, లోకేష్ లతో కూడా మాట్లాడారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో తాను నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచే టీడీపీ తరుపున పోటీ చేస్తానని కోటంరెడ్డి క్యాడర్ తో చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి.
నేడు ఇన్‌ఛార్జి ప్రకటన...
ఈ ఆడియో బయటకు లీకు కావడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కొందరు వైసీపీ నేతలు ఫోన్ లో సంప్రదించినా తాను ఇక పార్టీలో కొనసాగే అవకాశం లేదని చెప్పినట్లు తెలిసింది. దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వెంకటగిరి తరహాలోనే ఇన్‌చార్జిని నియమించాలని పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చింది. జగన్ తో నెల్లూరు జిల్లా ముఖ్యనేతలు సమావేశమయిన తర్వాత ఎవరు ఇన్‌ఛార్జి అన్న దానిపై క్లారిటీ వస్తుంది. కోటంరెడ్డిని ఇక పార్టీలో కొనసాగించడం మంచిది కాదని, ఆయనతో చర్చలు కూడా అనవసరమని వైసీపీ నిర్ణారణకు వచ్చింది.